హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ మండపాన్ని సందర్శించిన ఎస్ఐ

SRPT: వినాయక చవితి బందోబస్తులో భాగంగా హుజూర్‌నగర్ పాతబస్తీ యాదవ్ బజార్‌లోని గణేష్ మండపాన్ని ఎస్ఐ నరేష్ సందర్శించారు. మండప నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను శాంతియుతంగా, ఉత్సాహంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.