హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గణనాథుని సేవలో గంగుల

KNR: వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నగరంలోని పలు వినాయక మండపాల్లో పూజలు నిర్వహించారు. ప్రకాశ్‌గంజ్‌ వరసిద్ధి వినాయక ఆలయం, రామ్‌నగర్‌ మండపాల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.