వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో భారీ వర్షానికి విద్యుత్ వైర్లు తెగిపడగా, డ్యూటీలో ఉన్న ఇంతేజార్‌గంజ్ స్టేషన్ కానిస్టేబుళ్లు ఖాజా నిజాముద్దీన్, శివ తక్షణమే స్పందించారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో మరమ్మతులు చేయించి ప్రమాదాన్ని తప్పించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసిన కానిస్టేబుళ్ల చొరవను స్థానికులు, ఉన్నతాధికారులు అభినందించారు.
తెలంగాణ
విద్యుత్ షాక్ భయం.. స్పందించిన కానిస్టేబుళ్లు


