ASF: దహేగాం మండలంలో లగ్గాం గ్రామంలో ప్రధాన అర్చకులు శ్రీకాంత్ చారి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువత, భక్తులు మూడు రోజులుగా మండపాలు ఏర్పాటు చేసి సోమవారం గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
లగ్గాంలో వినాయక చవితి వేడుకలు


