BHPL: వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని గణనాథునికి పూజలు చేశారు. అనంతరం జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
గణేశ్ పూజా వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్


