KMR: సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేడు ఎస్సై పుష్ప రాజ్ ఆధ్వర్యంలో పేకాట శిబిరంపై దాడి చేసి అక్రమంగా పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2,080 నగదు, 4 ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మండలంలో ఎక్కడైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై దాడి.. నలుగురి అరెస్ట్


