కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సామర్లకోటలోని శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎస్పీకి ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
సామర్లకోట భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్పీ


