హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండపాలను దర్శించుకున్న దేవినేని అవినాష్

NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన వినాయక మండపాలను జిల్లా వై‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సందర్శించారు. మండపాల్లో కొలువుదీరిన స్వామివారికి పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు కలగాలని కోరుతూ.. అనంతరం నిర్వాహకులు అందించిన తీర్థప్రసాదాలను ఆయన స్వీకరించారు.