హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దక్షిణాఫ్రికాలో స్పీకర్ అయ్యన్న పర్యటన

AKP: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సోమవారం దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను సందర్శించారు. సర్వోదయ హౌస్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించి, ఆయన మునిమనవడు కిదార్‌ను కలిసి కలంకారీ శాలువాతో సత్కరించారు. అనంతరం కాన్సుల్ జనరల్ నితిన్ సుభాష్‌తో సమావేశమై ప్రవాసుల సమస్యలపై చర్చలు జరిపారు.