హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దారి తప్పిన యువకుడిని కాపాడిన పోలీసులు

AKP: ఉపాధి కోసం అనకాపల్లి వచ్చి తప్పిపోయిన జార్ఖండ్‌కు చెందిన భీమ్ కుమార్‌ను పట్టణ పోలీసులు కాపాడారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐ ప్రేమ్ కుమార్, సీసీటీవీల ఆధారంగా లక్ష్మీదేవిపేట వద్ద అతడిని గుర్తించారు. తలకు గాయం కావడంతో ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స చేయించి, సురక్షితంగా కుటుంబానికి అప్పగించారు.