ATP: తాడిపత్రి పట్టణంలోని ఓగేటి వీధిలో యువకులు వినాయక చవితిని పురస్కరించుకుని ప్రత్యేకంగా గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏకంగా 20 వేల రుద్రాక్షలతో వినాయకుడి విగ్రహాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. ఈ రుద్రాక్షల గణపతిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలో ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రిలో రుద్రాక్షల వినాయకుడు


