హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగుపాటుకు గేదెలు మృతి

ప్రకాశం: కనిగిరి మండలం బుడ్డాయిపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగు పడటంతో గ్రామానికి చెందిన కుమ్మరి కుంట మరియమ్మ‌కు చెందిన రెండు గేదెలు మృతి చెందాయి. రూ.2 లక్షల విలువైన గేదెలు మృతి చెందడంతో తమ జీవనాధారం కోల్పోవాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తన కుటుంబానికి ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు.