హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

NZB: వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.