హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎమ్మెల్యేకి మాటలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు'

HNK: చిన్న వర్షానికే హనుమకొండ నగర రోడ్లు జలమయమై చెరువులను తలపిస్తున్నాయని బీజేపీ నాయకురాలు రావు పద్మారెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మాటలపై ఉన్న శ్రద్ధ నగరాభివృద్ధిపై లేదని విమర్శించారు. డ్రైనేజీ పూడికతీత లేక నీరంతా రోడ్లపైకి చేరి వాహనదారులు, ప్రజలు నరకయాతన పడుతున్నారన్నారు. సమస్యలు తీర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.