ప్రకాశం: గిద్దలూరు మండలంలోని కృష్ణంశెట్టిపల్లిలో వినాయక చవితి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వేడుకల్లో పాల్గొని వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


