హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డుపైనే వాహనాల పార్కింగ్

NGKL: లింగాల మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ నుంచి పాత ఆంధ్ర బ్యాంకు వరకు గల ప్రధాన రహదారిపై ఇరువైపులా ద్విచక్ర వాహనాల అడ్డదిడ్డ పార్కింగ్‌తో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనివల్ల పాదాచారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై అస్తవ్యస్తంగా నిలుపుతున్న వాహనాల పార్కింగ్‌ను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.