హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అనంతపద్మనాభ స్వామి' అలంకారంలో గణనాథుడు

GNTR: తెనాలి గాంధీచౌక్‌లోని అశోక పెన్ వర్క్స్ ఎదురుగా వినాయక చవితి సందర్భంగా శ్రీ అనంతపద్మనాభ స్వామి అలంకారంలో గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. మండపం నుంచి మెయిన్‌రోడ్డు వరకు కమిటీ సభ్యులు భారీ విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో కొలువైన గణనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.