హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైమాస్ట్ లైట్లు ప్రారంభం

MBNR: చిన్నచింతకుంట మండలం పెద్ద వడ్డేమాన్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ లైట్ల ఏర్పాటుతో రాత్రివేళల్లో గ్రామంలో వెలుగులు నిండి, ప్రజలకు భద్రతతో పాటు రాకపోకలకు మరింత సౌకర్యం కలగనుంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.