హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నేత

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అల్లవరపు సంతోషి రవిశర్మ ఘన స్వాగతం పలికారు.