హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొగల్తూరులో డీజే వాహనం సీజ్..!

WG: వినాయక చవితి శోభాయాత్రలు, నిమజ్జన ఊరేగింపుల్లో నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని మొగల్తూరు పోలీసులు హెచ్చరించారు. సోమవారం మొగల్తూరు పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేసిన ఒక వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాన్ని స్టేషన్కు తరలించి, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.