హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారత మహిళల జట్టుకు ఎమ్మెల్యే అభినందనలు

ATP: మహిళల ఆసియా కప్ టీ20 విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి చరణి 4 వికెట్లతో మెరిసి విజయంలో కీలక పాత్ర పోషించడం గర్వకారణమన్నారు. ఆటగాళ్ల సమష్టి కృషి, బృందస్ఫూర్తితోనే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని కొనియాడారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.