హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాకాలంలో భయం.. ఇనుప స్తంభాలు

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఇనుప విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. కావేరమ్మపేట, బాలాజీనగర్, పాతబజార్, 23వ వార్డు సహా పలు ప్రాంతాల్లో ఇళ్లకు అతిసమీపంలో ఇవి ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని, వాటి స్థానంలో సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.