హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధీరజ్ బొమ్మదేవరకు ఎంపీ లావు అభినందనలు

PLD: ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందనలు తెలిపారు. ధీరజ్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశం మొత్తం గర్వించేలా చేసిందన్నారు. మున్ముందు మరెన్నో విజయాలు సాధించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.