హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా వినాయక చవితి వేడుకలు

అన్నమయ్య: కె.వీ.పల్లి పోలీస్ స్టేషన్‌లో వినాయక చవితి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎస్సై బి. వెంకట శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.