హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగర తీర మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి సాగరతీరంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల సప్తమృత్తిక విజయ గణపతిని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. సాయంత్రం నుంచి వేలాది మంది తరలివచ్చి క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. తొలిరోజు సుమారు 30 నుంచి 50 వేల మంది భక్తులు మహాగణపతిని దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. దీంతో తీరం వద్ద పండగ సందడి నెలకొంది.