హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా భవన్‌లో వైభవంగా గణేష్ చతుర్థి వేడుకలు..!

KMM: Dy. CM భట్టి విక్రమార్క మల్లు ప్రజా భవన్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర దినం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో జిల్లా, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.