హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడాదిగా అసంపూర్తిగా జంబాపూర్ రోడ్డు

VKB: మున్సిపల్ పరిధిలోని జంబాపూర్ వెళ్లే రోడ్డును తవ్వి వదిలేసి ఏడాది గడుస్తున్నా పనులు పూర్తి చేయడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే గుంతల్లో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు చొరవ తీసుకుని రోడ్డు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.