హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిపాలన గణనాథుడికి కలెక్టర్ పూజలు

NDL: నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లో వినాయక చవితి సందర్భంగా సోమవారం పరిపాలన గణపతికి కలెక్టర్ జి.రాజకుమారి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి పుష్పాలు, పత్రాలతో పూజలు చేశారు. జిల్లా ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ప్రార్థించారు. జిల్లా సర్వతోముఖ అభివృద్ధి, సంక్షేమం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.