హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైకిల్ పై వినాయకుడి ఊరేగింపు.\

GDWL: అలంపూర్ పట్టణంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ కాలనీలలో ప్రతిష్ఠించిన గణనాథులకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు సమర్పించారు. పట్టణంలోని ఓ వీధిలో ఏర్పాటు చేసిన గణపయ్యను మొదటి రోజే నిమజ్జనం చేయడానికి భక్త బాలురు ఉత్సాహంగా కదిలారు. సైకిల్‌పై తుంగభద్ర నదికి గణనాథున్ని తీసుకెళ్తూ కాలినడకన నిమజ్జనానికి పయనమయ్యారు.