హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పిన రెండు పెను ప్రమాదాలు

SRD: బొల్లారం పారిశ్రామికవాడలో ఆదివారం రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రాణే డైకాస్ట్ పరిశ్రమ సమీపంలో కుక్కను తప్పించబోయిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా, ముందు భాగం నుజ్జునుజ్జయింది. మరో ఘటనలో గండిగూడెం నుంచి వస్తున్న టిప్పర్.. వాహనాన్ని తప్పించబోయి ఆసానికుంటలో బోల్తా పడింది. రెండు ఘటనల్లోనూ ప్రాణనష్టం తప్పింది.