హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎండిపోయిన మొక్కజొన్నపంట

WNP: జిల్లా కేంద్రంలోని లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు మధుగం మహేష్‌ యాదవ్‌ 9 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసి రూ.6 లక్షలు పెట్టుబడి పెట్టారు. వర్షాభావం, జూరాల కాలువ ద్వారా సాగునీరు అందక పంట పూర్తిగా ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడి, కౌలు ఖర్చులు అప్పులుగా మారడంతో ప్రభుత్వం పంట నష్టాన్ని పరిశీలించి పరిహారం అందించాలని రైతు కోరారు.