హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'

ASR: ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చింతపల్లి ఎస్ డీపీవో సీహెచ్ తిరుపతిరావు సూచించారు. సోమవారం సీఐ బీ. సింహాచలం, అన్నవరం ఎస్సై సాయిరామ్‌తో కలిసి అన్నవరం వారపు సంతను సందర్శించారు. సంతకు వచ్చిన ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్లే పలువురు మృతి చెందారని డీఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు.