హైదరాబాద్: 28°C
తెలంగాణ

మినరల్ వాటర్ ప్లాంట్‌ ఏర్పాటుకు భూమిపూజ

GDWL: పాన్‌గల్ మండలం మల్లాయిపల్లిలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవతో మినరల్ వాటర్ ప్లాంట్‌కు సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఎస్ఎఫ్‌డీ నిధులు రూ.3.50 లక్షలతో షెడ్, వసతులు కల్పిస్తుండగా, కమ్యూనిటీ వాటర్ ఫౌండేషన్ యంత్రాలను అందిస్తోంది. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుండటంతో గ్రామ ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.