హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగుపాటుకు గురై యువకుడు మృతి

NLR: ఏఎస్ పేట మండలం గుంపర్లపాడు గ్రామ పొలాల్లో పిడుగుపాటుకు గురై నర్సారెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. పొలంలో మేతమేస్తున్న పశువులను తోలుకొచ్చేందుకు వెళ్లిన నర్సారెడ్డి తిరిగి వస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో సమీపంలో పిడుగు పడటంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.