హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

PLD: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలగాలని ఆయన ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఆంథోని రాజు, ఆర్ఐలు కృష్ణ, గోపీనాథ్, రాజు, యువరాజు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.