KNR: శివాజీ సేన ప్రచార కార్యదర్శిగా రామడుగుకు చెందిన కారుపాకల నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌లో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వన్నారం అక్షయ్, ప్రధాన కార్యదర్శి లాలు ప్రసాద్ నరేష్‌ను ఎంపిక చేశారు. హిందువుల ఐక్యత కోసం చేస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. హిందువులను సంఘటితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
తెలంగాణ
శివాజీ సేన జిల్లా ప్రచార కార్యదర్శిగా కారుపాకల నరేష్


