హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెంటపాడు కాలేజీలో హిందీ భాషా దినోత్సవం

WG: పెంటపాడు డీఆర్. గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాతీయ హిందీ భాషా దినోత్సవం నిర్వహించారు. ఇంఛార్జ్ ప్రిన్సిపల్ వాణి మాట్లాడుతూ.. హిందీ భాషలో ప్రావీణ్యం పెంచుకోవాలని, తద్వారా ప్రపంచంలో ఎక్కడైనా తిరగవచ్చన్నారు. హిందీ భాష ప్రాముఖ్యత తెలుసుకోవాలన్నారు. అనంతరం హిందీపై నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.