VIDEO: నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని పోస్టాఫీస్ నుండి సినిమా థియేటర్ రహదారి బురదమయమైంది. రెండు నెలల క్రితం డ్రైనేజీ తవ్వకాలు జరిపి మట్టిని సరిగా పూడ్చకపోవడంతో వర్షాలకు ఈ దుస్థితి దాపరించింది. పండుగ పూట కనీసం నడవడానికైనా వీల్లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
బురదమయంగా మారిన రోడ్డు


