హైదరాబాద్: 28°C
తెలంగాణ

టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

MBNR: చదువు మధ్యలో ఆపేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అవకాశం కల్పించారు. SSCకి 14 ఏళ్లు, ఇంటర్‌కు 15 ఏళ్లు నిండిన వారు అర్హులని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ఎం. శివయ్య తెలిపారు. SSC 83, ఇంటర్‌కు 114 అధ్యయన కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.