హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కస్తూర్బా స్ట్రీట్‌లో ప్రత్యేక వినాయకుడు

TPT: జిల్లాలోని కస్తూర్బా స్ట్రీట్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. 2026 ఇత్తడి వినాయక విగ్రహాలతో ప్రత్యేకంగా అలంకరించిన ఈ మండపం చూపరులను ఆకట్టుకుంటోంది. వినాయక చవితి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి.