NDL: బండి ఆత్మకూరు మండలం పెద్దదేవలాపురం సమీపంలోని ఏకశిలా ఆంజనేయస్వామి ఆలయం వద్ద బావిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని సంత జుటూరుకు చెందిన పుల్లయ్య(56)గా పోలీసులు గుర్తించారు. మద్యం సేవించి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉండవచ్చని మృతుడి భార్య నాగేశ్వరమ్మ తెలిపింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి అనుమానం లేదని ఆమె ఫిర్యాదు చేసినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బావిలో పుల్లయ్య మృతదేహం లభ్యం


