హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

10 లీటర్ల నాటు సారాయి స్వాధీనం

ప్రకాశం: పొదిలి(M) తలమల్ల గ్రామ శివారు ముసివాగు సమీపంలో నాటుసారాయి కాస్తున్న స్థావరాలపై పొదిలి ఎక్సైజ్ సీఐ అరుణకుమారి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి పది లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నాటు సారాయి తయారీకి ఉపయోగించేందుకు ఏర్పాటు చేసుకున్న డ్రమ్ములలో నిల్వ ఉంచిన ముడి పదార్థాలను ధ్వంసం చేశారు.