KDP: నందలూరు మండలంలో డీజే కమిటీ కుర్రాళ్లు ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎద్దుల బండి తోలుతూ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. రైతుల బంధువుడిగా గణపయ్య నేలవైపు కరుణతో చూస్తున్నట్లుగా రూపొందించిన విగ్రహం ఆకట్టుకుంది. రైతులు, ప్రజల కష్టాలు తొలగి,సమృద్ధిగా వర్షాలు కురవాలని భక్తులు గణనాథుడిని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
ఎద్దుల బండిపై దర్శనమిచ్చిన గణపయ్య


