హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ కార్యాలయంలో వినాయక పూజలు

కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎన్‌సి బజారన్న మాట్లాడుతూ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక మండపాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని కోరారు.