హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్.. కూలీ మృతి

NZB: జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామ శివారులో విద్యుత్ షాక్‌తో మనమల భాస్కర్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో  పచ్చిగడ్డి కోస్తుండగా బోర్ మోటార్ సర్వీస్ వైర్‌ను కొడవలితో కోయడంతో షాక్‌కు గురైయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్.ఐ. మహేష్  తెలిపారు.