JN: పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద తెలంగాణ ఐక్యవేదిక ఓదార్పు యాత్ర పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. మలిదశ ఉద్యమకారుడు మూల ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యాత్ర ఇంచార్జులు ఎండీ చంద్ భాషా, మనోహర్‌రావు, ఓడపల్లి శ్యామ్‌కృష్ణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు హాజరయ్యారు.
తెలంగాణ
తెలంగాణ ఐక్యవేదిక ఓదార్పు యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ


