ASR: అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయతీ సచివాలయ భవన నిర్మాణంలో అవకతవకలు జరిగాయని వైసీపీ మండల యువజన విభాగం నేత కొర్ర రమేష్ ఆరోపించారు. ప్రజాధనంతో చేపట్టిన భవన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయి శిథిలావస్థకు చేరినా, కాంట్రాక్టర్‌కు పూర్తి బిల్లులు చెల్లించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'సచివాలయ నిర్మాణంలో అవకతవకలు'


