హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

HYD: వినాయక చవితి పండగ వేళ ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇస్నాపూర్ జంక్షన్ వద్ద బైక్‌ను లారీ ఢీకొనడంతో ముబారక్‌పూర్‌కు చెందిన నరసింహులు (50) మృతిచెందాడు. ఉపాధి కోసం పటాన్‌చెరువుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.