JN: నర్మెట్ట మండలం గండిరామవరంలో సోమవారం భారీ వర్షంతో చెరువులు, కుంటలు నిండుతున్నాయి. చెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో పాటు లోతువాగులో నీటి ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. మరో గంటపాటు వర్షం కురిస్తే చెరువుకు మత్తడి పడే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు. చెరువులు నిండుతుండటంతో యాసంగి పంటలకు సాగునీటి ఇబ్బందులు ఉండవని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: భారీ వర్షంతో నిండుతున్న చెరువులు


