E.G: కడియం మండలంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. టన్నున్నర మట్టితో రూపొందించిన ఈ విగ్రహానికి సుమారు 25 వేల రుద్రాక్షలను అలంకరణగా వినియోగించారు. రుద్రాక్షలతో తీర్చిదిద్దిన గణపయ్య భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ చూపరులను కట్టిపడేస్తోంది. విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కడియంలో కొలువుదీరిన కళ్లుచెదిరే భారీ మట్టి గణపయ్య


